‘ఫార్ములా-ఈ’ కేసులో జైలుకు పోవడం ఖాయం: కోమటిరెడ్డి

67చూసినవారు
‘ఫార్ములా-ఈ’ కేసులో జైలుకు పోవడం ఖాయం: కోమటిరెడ్డి
గత పాలకులు ఎన్నికల ముందు రైతుబంధు కోసమో.. ఇతర అవసరాల కోసమో రూ.7,380 కోట్లకు ఓఆర్‌ఆర్‌ టోల్‌ లీజును అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 'ప్రతిపక్షాల కోరిక మేరకే సీఎం రేవంత్‌రెడ్డి దానిపై సిట్‌ వేశారు. అవకతవకలు చేసిన వాళ్లు బయటకొస్తారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.6,500 కోట్ల ఖర్చు అయింది. అలాంటిదాన్ని కేవలం రూ.7,380 కోట్లకు టోల్‌ లీజును అమ్మేయడం దారుణం. ఫార్ములా-ఈ రేసు కేసులో ఒకరో.. ఇద్దరో జైలుకు పోవడం ఖాయం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్