రూ.82 వేలు దాటిన తులం బంగారం

85చూసినవారు
రూ.82 వేలు దాటిన తులం బంగారం
దీపావళి వేళ బంగారం ధర తారాజువ్వలా దూసుకెళ్తోంది. దేశ రాజధానిలో ఢిల్లీలో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ.82,400కు చేరింది. దీపావళి డిమాండ్‌ దృష్ట్యా బంగారు ఆభరణ విక్రేతలు భారీగా బంగారం కొనుగోలు చేయడం బంగారం పెరుగుదలకు కారణమని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 22క్యారెట్ల బంగారం ధర రూ.82 వేల మార్కును చేరిందన్నారు. గతేడాది ఇదే సమయంలో ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.61,200గా ఉంది.

సంబంధిత పోస్ట్