మందుబాబులకు శుభవార్త. బోర్బన్ విస్కీ దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని భారత్ తగ్గించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విమర్శల అనంతరం పన్నును 150% నుంచి 50 శాతానికి తగ్గించింది. అయితే, ఇతర లిక్కర్స్ మీద ఉన్న 100% పన్నును మాత్రం కొనసాగించనుంది. దీంతో బోర్బన్ విస్కీ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.