భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో భారత ఫ్యాన్స్ మాత్రమే గాక ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్టులకు దూరంగా ఉన్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ధర్మశాల టెస్టుకు కోహ్లీ జట్టులోకి తిరిగి వస్తాడని అన్నాడు.