రైతులకు గుడ్ న్యూస్: ఎరువులపై సబ్సిడీ కొనసాగింపు

580చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్: ఎరువులపై సబ్సిడీ కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రాయితీల్లో ఎరువులకు కోత ఉండదని, ఎరువులపై సబ్సిడీని కొనసాగించేందుకు రూ.24,420 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. గతంలో మాదిరిగానే DAP 50 కేజీల బ్యాగ్ రూ.1,350, MOP బ్యాగ్ రూ.1,670, NPK బ్యాగ్ రూ.1,470కి లభిస్తాయి. కిలో నైట్రోజన్ రూ.47.02, ఫాస్ఫేట్ రూ.28.72, పొటాషియంలపై రూ.2.38, సల్ఫర్ రూ.1.89 సబ్సిడీ ఉంటుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్