అన్ లైన్ టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్ కోసం IRCTC, అన్ రిజర్వుడ్ టికెట్ల కోసం UTS, ఫుడ్ ఆర్డర్ కోసం IRCTC e-Catering, కంప్లైంట్స్, ఫీడ్ బ్యాక్ కోసం ‘రైల్ మదద్’ అనే యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా రైల్వే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించేందుకు రైల్వేశాఖ 'SWA RAIL' అనే యాప్ తెస్తోంది. తాజాగా కొంతమందికి ముందస్తు అనుమతి ఇచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.