మహిళలకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో నెలకు రూ.1500

56చూసినవారు
మహిళలకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో నెలకు రూ.1500
కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ మహారాష్ట్రలో ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. "ముఖ్యమంత్రి మాఝీ లడకీ బహిన్ యోజన" పేరుతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి అజిత్ పవార్ స్పష్టం చేశారు. జులై నెల నుంచే అర్హులైన మహిళల ఖాతాల్లో నెల నెలా రూ.1500 జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.46 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్