గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగులకు వేతనం పెంపు!

457605చూసినవారు
గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగులకు వేతనం పెంపు!
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరుగనుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ప్రభుత్వం రంగ బ్యాంకులపై ఏటా రూ.8,284 కోట్ల భారం పడనుంది. ఈ పెంపుతో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అలాగే అన్ని శనివారాలు సెలవులకు ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకోగా, ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్