చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం దృష్టి

55చూసినవారు
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం దృష్టి
చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వరం) ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీని పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, తాజాగా నిర్మాణ వ్యయం, భూసేకరణ తదితర అంశాలపై అధ్యయనం చేసి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం నేపథ్యంలో చిన్న కాళేశ్వరాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో అప్పటివరకు చేసిన పనులు కూడా దెబ్బతిన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్