భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్

82చూసినవారు
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్
భద్రాచలం సీతారామచంద్రస్వామిని శుక్రవారం తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌కు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ ఈవో రమాదేవి అందజేశారు. అంతకుముందు గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఐటీడీఏ పీవో రాహుల్‌ స్వాగతం పలికారు. గవర్నర్‌తో పాటు ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్