ప్రభుత్వానికి టీచర్ అభ్యర్థుల బాధలు పట్టవు: హరీష్

66చూసినవారు
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమన్నారు. పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్