ప్రెస్ వూ ఐ డ్రాప్స్ తయారీకి అనుమతి నిలిపివేసిన ప్రభుత్వం

60చూసినవారు
ప్రెస్ వూ ఐ డ్రాప్స్ తయారీకి అనుమతి నిలిపివేసిన ప్రభుత్వం
‘ప్రెస్ వూ' ఐ డ్రాప్స్ తయారీ సంస్థ ఎన్టాడ్ ఫార్మాకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఐ డ్రాప్స్ తయారీ & మార్కెటింగ్ కోసం ఆ సంస్థకు ఇచ్చిన అనుమతులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిలిపివేసింది. ఔషధ పనితీరుకి సంబంధించిన అనధికార ప్రచారమే దీనికి కారణమని తెలిపింది. “ఈ మందు కళ్లద్దాలపై ఆధారపడటాన్ని తగ్గించి, వాటి స్థానాన్ని భర్తీ చేస్తుంది. 15 నిమిషాల్లోనే దగ్గరి దృష్టిని మెరుగుపరుస్తుంది” అని సంస్థ ప్రచారం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్