ప్రభుత్వ నిర్ణయం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం: ఫిలిం ఛాంబర్‌

55చూసినవారు
ప్రభుత్వ నిర్ణయం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం: ఫిలిం ఛాంబర్‌
సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుపై 2శాతం పన్ను విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమకు ఇది అశనిపాతమని అధ్యక్షుడు ఎన్‌.ఎం సురేశ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 637 థియేటర్లు ఉండగా వాటిలో దాదాపు 130 మూసివేతకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి మరోసారి చర్చిస్తామని ఎన్‌.ఎం. సురేశ్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you