AP: కడప జిల్లా శెట్టివారిపల్లిలో తన అప్పులు తీర్చేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని మనవడే తాతను చంపాడు. గ్రామానికి చెందిన వీరారెడ్డిని కొంతకాలంగా అతని మనవడు డబ్బులు అడుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై గత నెల 6న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వీరారెడ్డిపై దాడి చేసి చంపిన మనవడు, దాన్ని సాధారణ మృతిలా చిత్రీకరించాడు. అయితే, తాతను చంపిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కావడంతో హత్య విషయం బయటపడింది.