అమెరికాపై ఇంగ్లాండ్ ఘన విజయం

73చూసినవారు
అమెరికాపై ఇంగ్లాండ్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 117 పరుగులు చేసి గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ 38 బంతుల్లో 83 రన్స్ చేసి USA బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ పోరులో నిలిచింది.

సంబంధిత పోస్ట్