కట్నం ఇవ్వలేదని పెళ్లి వేదికపై నుంచి వెళ్లిపోయిన వరుడు (వీడియో)

60చూసినవారు
వరకట్నం ఇవ్వలేదని పెళ్లిపీటలపై వివాహాలు ఆగిపోతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఓ దారుణ ఘటన తాజాగా యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది. వధువు కుటుంబ సభ్యులు కట్నం ఇవ్వలేదని ఒక వరుడు అలిగాడు. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి వేదికపై నుంచి కోపంగా వెళ్లిపోయాడు. దీంతో వివాహం రద్దు అయింది. ఈ ఘటనతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వివాహానికి వచ్చిన అతిథులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్