జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. బీమాపై 18 శాతం పన్నును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించడాన్ని విమర్శించారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దీనిని సమీక్షించాలని కోరుతూ నిర్మలా సీతారామన్‌కు మమతా బెనర్జీ లేఖ రాశారు.