చింత చెట్టు ఆకులను ఉపయోగించి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో చింత ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని పేస్టులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఓ 15 నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో తలపై రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలపడతాయి. అలాగే జుట్టు చిట్లడం, రాలడం, దురద వంటివి తగ్గుతాయి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది.