AP: తిరుమలలో అన్య మతానికి చెందిన వాహనం హల్ చల్ చేసింది. అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాన్ని ఎలాంటి తనిఖీలు లేకుండా పైకి పంపినట్టు తెలుస్తోంది. వాహనం వెనుక అద్దాలు మీద ఏసుక్రీస్తును స్తుతిస్తూ బైబిల్‌లోని వాక్యాలు ఉన్నాయి. AP21AZ3334 నెంబర్ గల వాహనం తిరుమలలో ఆలయం సమీపంలో కూడా సంచరించినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు టోల్‌గేట్ వద్ద ఎవరు వాహనాన్ని తనిఖీ చేశారన్న విషయాన్ని సీసీ ఫుటేజీ ద్వారా పరిశీలిస్తున్నారు.