హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం తినేందుకు వెళ్తున్న కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వనస్థలిపురంలోని మిఠాయి వాలా షాపునకు ఓ కస్టమర్ తన పిల్లలతో పాటు శుక్రవారం వెళ్లాడు. చాట్ భాండార్ కొని ఇంటికి తీసుకెళ్లి తిన్నారు. సగం తిన్నాక అందులో చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో స్వీట్ షాపు యజమానికి ఆ కస్టమర్ విషయం చెప్పాడు. అయితే షాపు నిర్వాహకులు పట్టించుకోలేదు.