ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ క్లారిటీ ఇచ్చాడు. హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం లేదని.. గతంలో ఉన్న జట్టుతోనే ముందుకెళ్తున్నామని స్పష్టం చేశాడు. జట్టులో ఎలాంటి చేరికలు లేవు. ప్రతి రోజు కీలకమే. చివరి టెస్టులో విజయం సాధించడంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నామని తెలిపాడు.