షేక్ హసీనా లండన్ వెళ్తారన్న ప్రచారంపై యూకే హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పందించారు. ‘ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు.. తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలి. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గం’ అని మీడియాకు వెల్లడించారు. భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.