HMPV వైరస్ ఎఫెక్ట్‌తో నేడు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు భారత్‌లోనూ ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు వార్తలు రావడంతో సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82గా ఉంది.