ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పాదాభివందనం చేయాలనిపించిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "వకీల్ సాబ్ సినిమా రెమ్యునరేషనే జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడిందని గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో పవన్ చెప్పే వరకు నాకు తెలియదు. అంత పెద్ద స్టేజ్‌పై ఆ విషయం చెప్పటంతో చాలా ఎమోషనల్ అయ్యా. ఓ డిప్యూటీ సీఎం, లీడర్‌గా ఉండి.. ఆయనలా పబ్లిక్‌గా చెప్పినప్పుడు పాదాభివందనం చేయాలనిపించింది." అని దిల్ రాజు తెలిపారు.