ఎవరెస్ట్‌ శిఖరం డ్రోన్‌ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూశారా? (వీడియో)

560చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చైనాకి చెందిన డ్రోన్‌ మేకర్‌ అద్భుతమైన వీడియో చిత్రీకరించాడు. సముద్రమట్టానికి 5,300 ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనులవిందు చేస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్