జైలు నుంచి విడుదలైన హెచ్‌డీ రేవణ్ణ

70చూసినవారు
జైలు నుంచి విడుదలైన హెచ్‌డీ రేవణ్ణ
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ ఇవాళ పరప్ప అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిన్న ఈ కేసును విచారించగా, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన ఈరోజు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. రేవణ్ణ విడుదల నేపథ్యంలో భారీ సంఖ్యలో జేడీఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్