అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పంపబోతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్‌లో బాగంగా అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది. ఇటీవలే గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందిన శుభాంశు శుక్లాను ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేశారు.