ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని నదికి సమీపంలో ఒక మహిళ తల లేని మృతదేహం, కొద్దిదూరంలో నీటిలో తేలియాడుతూ 7 ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. బహుశా వీరిద్దరికీ బంధుత్వం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ విభాగం సభ్యులు అక్కడి తల, తల లేని శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.