గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ కళ్ల కింద నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారికి గుమ్మడికాయ మంచి ఔషధం. దీనిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.