హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొండ రాళ్ల తొలగింపునకు పేలుళ్లు జరపడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కొండ రాళ్ల తొలగింపునకు రాత్రి వేళల్లో పేలుళ్లు జరుపుతున్నారని మీడియాలో ఇటీవల కథనం వచ్చింది. దీని ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ లేఖ రాశారు. దీంతో ఆ లేఖను సీజే ధర్మాసనం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, తవిచారణను వాయిదా వేసింది.