దానిమ్మ గింజలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండులో విటమిన్లు, మినరల్స్, యాంటీ అక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ గింజలను తినడం వల్ల చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి. బరువు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.