గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, జియో, విఐ, BSNLలో బెస్ట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది.