భద్రాచలంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్దకు భారీగా వరదనీరు చేరింది. అన్నదాన సత్రం పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. పడమర మెట్ల వైపు మోకాలు లోతు నీరు చేరడంతో భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. పలు వాహనాలు సైతం మునిగిపోయాయి. వరద నీరు నిలవకుండా చూడాలని అధికారులను స్థానికులు కోరారు.