మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున ఉన్న ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఫలితంగా రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.