తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు

78చూసినవారు
తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం పేర్కొంది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. కాగా శనివారం మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్