యునెస్కో తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది. అవేంటంటే.. విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ అక్షరాస్యత నాయకత్వం" కోసం అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం. సాంస్కృతిక, శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది.