రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు

63చూసినవారు
రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు
రేపటి నుంచి 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రేపు నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. జూన్ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్