కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

75చూసినవారు
కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో 582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్