భారీ వర్షాలు.. ఐదు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

63చూసినవారు
భారీ వర్షాలు.. ఐదు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా రాష్ట్రాల్లో రుతుపవనాలు క్రియాశీలక దశలో ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులలో సైతం భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్