HYDలో ఇవాళ భారీ వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఖాజాగూడ కూడలి, మల్కంచెరువు, బయోడైవర్సిటీ కూడలి, ఐకియా కూడలి, గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. మరికొన్ని గంటల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. GHMC, DRF బృందాలు రంగంలోకి దిగాయి. సాయం కోసం 040 2111 1111కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.