జమ్మూ నుంచి త్రికూట పర్వతాల్లోని మాతా వైష్ణవోదేవి క్షేత్రానికి జూన్ 18 నుంచి నేరుగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంవీడీబీ ప్రకటించింది. భక్తులకు ఉత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ సర్వీసులను మొదలుపెట్టినట్లు వైష్ణవోదేవి బోర్డు సీఈవో అన్షుల్ గార్గ్ తెలిపారు. హెలికాప్టర్ సర్వీసు ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లకు బ్యాటరీ కార్ సేవ, ప్రత్యేక దర్శనం, ప్రసాదం, రోప్‌వే సేవలు కూడా కల్పించనున్నారు.