బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

73చూసినవారు
బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంతో ఆ ఘటన జరిగిన ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభత్వాన్ని ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్