తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలేంతవరకు గ్రూప్-1 రిజల్ట్స్ ప్రకటించవద్దని కోర్టును అభ్యర్థులు కోరారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. వీరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.