జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీ ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.