హెచ్‌ఐవీ వైరస్‌ను నియంత్రించే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది. ఇటీవల క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు కనిపించాయని, ఈ టీకాను రోగులకు ఇవ్వడానికి మరో ముందడుగు పడిందని తెలిపింది. షెంజెన్ థర్డ్ పీపుల్స్ హాస్పిటల్‌లో 45 మంది రోగులపై ఈ పరీక్షలు జరపగా.. తమ వ్యాక్సిన్‌ను తీసుకున్న అధికులలో టీ-సెల్స్ (తెల్ల రక్త కణాలు) స్పందనలు రెట్టింపు అయ్యాయని తెలిపింది.