ప్రభుత్వంపై హోం గార్డులు జంగ్ సైరన్ వినిపించారు. హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని, కారుణ్య నియామకాలు అనుమతించాలి అని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 2 నుంచి దీక్షలకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. ఈ మేరకు సీవీ ఆనంద్‌కు తెలంగాణ హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ పేరిట లేఖ విడుదల చేశారు. ఇప్పటికే బెటాలియన్ కానిస్టేబుళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.