ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం సమయంలో దీపారాధన చేసి, దేవుడిని స్మరించుకుంటారు. అయితే దీపారాధన ఎందుకు చేస్తారంటే.. పురాణాల ప్రకారం, వెలుగు జ్ఞానానికి.. చీకటి అజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వెలుగును చీకటిని తొలగించినట్టుగా.. జ్ఞానం, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకే అన్ని సంపదలకన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తారు.