ఓ తల్లి తన పేగు బంధాన్ని మర్చిపోయింది. పొత్తిళ్లలోని పసి పాపను డబ్బులకు అమ్మేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. ఓ అంగన్వాడీ కార్యకర్త ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో పసిపాపకు జన్మనిచ్చింది. అయితే ఆమె పసిపాపను విక్రయించాలని అనుకుంది. ఈ విషయాన్ని మధ్యవర్తులకు చెప్పింది. దాంతో వారు ఖమ్మం జిల్లా కల్లూరికి చెందిన వ్యక్తికి రూ.10 వేలకే పసిపాపకు అమ్మేశారు. డబ్బులు తీసుకుని మహిళ కనిపించకుండా పోయింది. ఈ విషయం ఆస్పత్రి వైద్యులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. పసిపాప ఆచూకీ తెలుసుకుని ఒంగోలు తీసుకొచ్చారు. తల్లి కోసం గాలిస్తున్నారు.