AP: ప్రధానమంత్రి ఆవాజ్ యోజన 1.0 ద్వారా చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో హౌసింగ్ శాఖ ద్వారా 50 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, ఈ ఏడాది డిసెంబర్‌లో లక్షమందికి ఇళ్ల తాళాలను ఇచ్చేలా నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇసుక కొరత కారణంగా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగలేదన్నారు.