TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. 'ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా? ప్రభుత్వానికి, సీఎంకు ఇంత అసహనం పనికిరాదు. తక్షణమే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను' అని Xలో ట్వీట్ చేశారు.